Wednesday, 28 September 2016

తుంటరి గాడ్పు

ఉదయం ఉరుముల మెరుపులు 
మధ్యాహ్నం మండే ఎండలు 
సాయంకాలం గాలి వాన
ఏమిటీ వైపరీత్యం'
ఆశ్చర్యంగా 
అడిగా పైర గాలిని

'అరణ్యాలను ఎడార్లను చేసారు
ఎడార్లలో అణుబాంబుల మంటలను లేపారు
పగలును రాత్రులుగా
నిశీధలను వెలుగు తారకలుగా మార్చారు
చెట్టును పుట్టను అంగట్లో అమ్మకానికి పెట్టారు, 

ఇంతకు మించిన అబ్బురమేముంటుంది చెప్పు'
ఎదురు ప్రశ్నించింది తుంటరి గాడ్పు.

No comments:

Post a Comment