Tuesday, 17 October 2017
Saturday, 14 October 2017
సమాజ నిర్మాణ పునాది
సమాజ నిర్మాణ పునాది...
~~~~~~~~~~~~~
నా బాల్యం పొత్తిల్లలో ఏం జరిగిందో
నాకు అణు మాత్రం గుర్తు లేదు
నా నడకల తూగిసలాటలో ఎలాంటి
అడుగుల తడబాటులో నాకేం యాది లేవు.
నూనూగు మీసాల నూత్న యవ్వనం
కొంచెం కొంచెం జ్ఞాపకమున్నది
నాన్న అలా అలా అలలా కనిపించడం
మరు క్షణం స్నేహితుల మధ్య కలిసిపోవడం
ఆ తర్వాత అర్థ రాత్రి తూలుతూ రావడం లీలగా గుర్తు.
నా అయ్య మనసు లేత వెన్న ముద్ద
కఠినమైన మాటల తూటాలను సంధించడం
పేలే తుపాకుల మాటల మూటలను నోరు సంచిలో
నేనెప్పుడూ చూడలేదు.
మా నాయిన
తెల్లని అంగి, మల్లెపూల వెలుగు దోవతీ ధరించినప్పుడు దొర బాబులా అందంగా ఆనందం వెదజల్లే వారు...
మా బాపు ముసిముసి నవ్వులు విసిరిన క్షణాలు అరుదు
ఆ వేళ వెన్నెల వెలుగుల సంతకాలు
ఇంటిని అద్భుతమైన కాంతులతో
నందనోద్యాన సుందర దృశ్యాలతో
నింపేవి...
మనుమరాళ్ళను
చూద్దామని ఒక్కడే ఎర్ర బస్సెక్కి ఉల్లాసంగా ఉరికస్తడు
పుట్టిన నేలను ఎన్నడూ మరువడు
పొయ్యే తొవ్వల తొంటి విరిగినా ఎవ్వలనూ నిందించడు
నా ప్రాప్తం అనుకొంటూ సూర్య నమస్కారాలు చేస్తడు...
ఇప్పుడు
ఎనభై ఏళ్ళ వయసులో
రెండో బాల్యంలో
మా నాన్న ...
తన రెండు కాళ్ళకు ఆసరాగా
ఓ మూడో కాలు కర్ర
ఆ నవ్వు పసిపాప నగవులా...
రెండు మూడు ముద్దలతో రోజంతా...
నవ యువకునిలా శక్తి సామర్ధ్యాలు నింపుకుంటడు...
అప్పుడప్పుడు
ఓ నాలుగు పొగ బీడీ పీకలకోసం నడి బజార్లకు వచ్చి
ప్రియురాలి రాక కోసం
కొత్తగా ఈడుకచ్చిన పోరడు ఎదిరి చూస్తున్నట్టుగా ఎదురు చూడటం
అవి తన ముడతల ఎండి చేతులతో
అపురూపంగా ప్రేమగా
బంగారు కొండను గెలుచుకున్నట్టు తడమడం...
చుట్ట ముట్టించి బంగారు పొగ రాగాలను వెదజల్లుతంటే
అతని ఆనందం ఈ పద్యంలో పొసగదు
దీర్ఘ కావ్యానికీ అందదు...
అమ్మకు ఆసరా నాన్న
కుటుంబానికి పక్కటెముక అయ్య
అన్నీ ఇవ్వడమే తప్ప
ఏనాడూ తనకిది కావాలని
పేచీ ఎరుగని వారు నాయిన
సమాజ నిర్మాణానికి పునాది బాపు...
-విలాసాగరం రవీందర్
94409 32934.
Friday, 29 September 2017
Break up
బ్రేక్ అప్
స్ స్ స్...
దిక్కుల చివర ఆ చిల్లులు పడ్డ మాటల దిగంతాలను
మాట్లాడించకు
నిన్నటి గవ్వల చప్పుడులో
వేడి నెత్తుటి మరకల తడి ఇంకా ఆరనే లేదులే -
అనుకుంటాం గాని
రోజులు పోతబోసినట్టు ఒకేలా ఎదురస్తే
కిక్కేం వుండదులే దోస్త్
అప్పుడప్పుడు గుండెలను మెలిపెడుతూ
నిప్పుకనికలై మండాలి –
ప్రేమ ఎప్పుడూ
జాలువారే ఝరీ ప్రవాహమై మెరిస్తే ఇన్ని కథలెక్కడివి ?
శిఖరపు కొసలో రక్త ధారల నదులు
జీవాన్ని పొందినప్పుడే కదా
ఓ ప్రత్యుశపు కాంతి రాగ రంజితం అయ్యేది –
అన్ని ప్రయత్నాలూ
వైఫల్య తీరం చేరినప్పుడే
తుది వాక్యం కొరకు మనసు
ఉరకలు వేస్తుంది
ప్రపంచమంతా అన్యాయం అంటూ అరుస్తూ
ఆకాశంకేసి తలబాదుకుంటుంది -
ముగింపు
ఎక్కడో పోగొట్టుకొని
దారి కోసం వెతుకుతుంటుంది –
తేది : 29.08.2016.
స్ స్ స్...
దిక్కుల చివర ఆ చిల్లులు పడ్డ మాటల దిగంతాలను
మాట్లాడించకు
నిన్నటి గవ్వల చప్పుడులో
వేడి నెత్తుటి మరకల తడి ఇంకా ఆరనే లేదులే -
అనుకుంటాం గాని
రోజులు పోతబోసినట్టు ఒకేలా ఎదురస్తే
కిక్కేం వుండదులే దోస్త్
అప్పుడప్పుడు గుండెలను మెలిపెడుతూ
నిప్పుకనికలై మండాలి –
ప్రేమ ఎప్పుడూ
జాలువారే ఝరీ ప్రవాహమై మెరిస్తే ఇన్ని కథలెక్కడివి ?
శిఖరపు కొసలో రక్త ధారల నదులు
జీవాన్ని పొందినప్పుడే కదా
ఓ ప్రత్యుశపు కాంతి రాగ రంజితం అయ్యేది –
అన్ని ప్రయత్నాలూ
వైఫల్య తీరం చేరినప్పుడే
తుది వాక్యం కొరకు మనసు
ఉరకలు వేస్తుంది
ప్రపంచమంతా అన్యాయం అంటూ అరుస్తూ
ఆకాశంకేసి తలబాదుకుంటుంది -
ముగింపు
ఎక్కడో పోగొట్టుకొని
దారి కోసం వెతుకుతుంటుంది –
తేది : 29.08.2016.
మది గీతలు
మది గీతలు
"ఏమీ రాయబడని నల్ల బల్ల మనసు"
తొలి వయసులో ఉన్నప్పుడు
మనస్తత్వ శాస్త్రం చెప్పిన మాట.
రెండు పదులు గిర్రున తిరిగాక
ఇప్పుడు మనసు నిండా అన్నీ గీతలే !
కొన్ని గుండ్రంగా
మరి కొన్ని చదరంగా
ఇంకొన్ని అడ్డదిడ్డంగా.
ఇయ్యాల అన్నీ రాసిన నల్ల బల్ల మనసు
ముదిమికి ఇక్కొద్ది దూరంగా
ప్రేమగా తల నిమురగలదు.
శత్రువు తలనూ తెంచగలదు.
ద్వేషం రూపురేఖలు
హింస ప్రతి రూపం
కక్షల కహానీలు అన్నీ ఎరుక.
మొన్న కొంచెం
మౌనం విశ్వ రూపాన్ని
విశ్లేషణ చేయడం నేర్చుకున్న...!
ఇప్పుడు అర్థం అయింది
తీసుకొనడం తెలియని వారికి
ఏవీ ఇవ్వకూడదని,
తెలుసుకునే మదికే
ఏదైనా ఇవ్వాలని...!!
తేది: 15.06.2017.
"ఏమీ రాయబడని నల్ల బల్ల మనసు"
తొలి వయసులో ఉన్నప్పుడు
మనస్తత్వ శాస్త్రం చెప్పిన మాట.
రెండు పదులు గిర్రున తిరిగాక
ఇప్పుడు మనసు నిండా అన్నీ గీతలే !
కొన్ని గుండ్రంగా
మరి కొన్ని చదరంగా
ఇంకొన్ని అడ్డదిడ్డంగా.
ఇయ్యాల అన్నీ రాసిన నల్ల బల్ల మనసు
ముదిమికి ఇక్కొద్ది దూరంగా
ప్రేమగా తల నిమురగలదు.
శత్రువు తలనూ తెంచగలదు.
ద్వేషం రూపురేఖలు
హింస ప్రతి రూపం
కక్షల కహానీలు అన్నీ ఎరుక.
మొన్న కొంచెం
మౌనం విశ్వ రూపాన్ని
విశ్లేషణ చేయడం నేర్చుకున్న...!
ఇప్పుడు అర్థం అయింది
తీసుకొనడం తెలియని వారికి
ఏవీ ఇవ్వకూడదని,
తెలుసుకునే మదికే
ఏదైనా ఇవ్వాలని...!!
తేది: 15.06.2017.
వయ్యిల ముచ్చట్లు
వయ్యిల ముచ్చట్లు...
~~~~~~~~~~~
నేను ఐదోదిల అక్కరం ముక్కలు నేర్చుకున్న సంది
అక్షరాలను
వాక్యాలను
పేరాలను
పేజీలను
పొత్తాలను మర్లేస్తనే ఉన్న...!
ఎక్కడా అలుపు రాలే
ఆయాసం పుట్టలే
పైపెచ్చు ఎక్కువ ఉత్సుకత పెరుగుతనే ఉంది...!
ఏ వయ్యిల ఏ తాత నా కోసం ఏం రాసిండో అని,
ఏ పుస్తకంల ఏ మహాత్ముడు నా కొరకు ఏం దాసి పెట్టిండో అని,
ఏ బుక్కుల ఏ గొప్ప మనిషి నా కోసం ఏం సలహాలు ఇచ్చిండో అని,
ఎతుకుతనే ఉన్న...
గాలిస్తనే ఉన్న...!
చానా రాసిపెట్టిండ్ర్రు...
మస్తు దాసిండ్రు...
గొప్ప ఇకమతులు జెప్పిండ్రు...
కొంచెమాగుండ్రి...!
గా కరీంనగర్ బుక్ ఫెయిర్ ల
గా సిద్ధిపేట బుక్ ఫెయిర్ ల
కొన్ని వయ్యిలు కొనుక్కొని అచ్చి
మిగతా ముచ్చట్లు జెబుతా...!
పొత్తాలన్నీ అయిపోతున్నయట...
జెల్దే అస్త
కూసంత ఓ సెవ్వు ఇటేసి ఉంచుండ్రి...!
-విలాసాగరం రవీందర్
94409 32934.
తేది:02.09 2017.
~~~~~~~~~~~
నేను ఐదోదిల అక్కరం ముక్కలు నేర్చుకున్న సంది
అక్షరాలను
వాక్యాలను
పేరాలను
పేజీలను
పొత్తాలను మర్లేస్తనే ఉన్న...!
ఎక్కడా అలుపు రాలే
ఆయాసం పుట్టలే
పైపెచ్చు ఎక్కువ ఉత్సుకత పెరుగుతనే ఉంది...!
ఏ వయ్యిల ఏ తాత నా కోసం ఏం రాసిండో అని,
ఏ పుస్తకంల ఏ మహాత్ముడు నా కొరకు ఏం దాసి పెట్టిండో అని,
ఏ బుక్కుల ఏ గొప్ప మనిషి నా కోసం ఏం సలహాలు ఇచ్చిండో అని,
ఎతుకుతనే ఉన్న...
గాలిస్తనే ఉన్న...!
చానా రాసిపెట్టిండ్ర్రు...
మస్తు దాసిండ్రు...
గొప్ప ఇకమతులు జెప్పిండ్రు...
కొంచెమాగుండ్రి...!
గా కరీంనగర్ బుక్ ఫెయిర్ ల
గా సిద్ధిపేట బుక్ ఫెయిర్ ల
కొన్ని వయ్యిలు కొనుక్కొని అచ్చి
మిగతా ముచ్చట్లు జెబుతా...!
పొత్తాలన్నీ అయిపోతున్నయట...
జెల్దే అస్త
కూసంత ఓ సెవ్వు ఇటేసి ఉంచుండ్రి...!
-విలాసాగరం రవీందర్
94409 32934.
తేది:02.09 2017.
నీచపు మనుషులు
నీచపు మనుషులు
======= =====
మొగ్గను చిదిమెయ్యడం
పువ్వును నలిపెయ్యడం
ఆసరా నిలిచిన కొమ్మను కొరికెయ్యడం
నీడనిచ్చిన చెట్టును పెకిలించడం
మదపు ముఖాలకు, వెకిలి మూర్ఖులకు సాధారణమే...!
ఆపదలో ఆదుకున్న చేయిని కరెన్సీ నోట్లుగా లెక్కించడం
ఆత్మీయతను పంచిన మనుషులను నోట్ల కట్టలుగా భావించడం
తలను బాదడం
నేలకేసి కొట్టడం
రక్తపు మరకలు తేవడం
ఇంటెన్సీవ్ కేర్ లోకి తోసేయడం
కొన్ని ద్రోహపు చేతులకు సర్వ సాధారణమే...!!
అయినా
ఆగకుండా గబగబా నోట్లో గంజాయి సిగరేట్లను వెలిగించడం
కట్టుకున్న ఆలిచేత అష్ట కష్టాలు పెట్టించడం
పసి హృదయులను అల్లకల్లోలం చేయించడం
అయ్యా అవ్వలను నానా బూతులు తిట్టేలా చేయడం
కొన్ని నీచపు ముఖాలకు బర్కిల్ సిగరేట్ పీల్చినంత తేలికనే...!!!
పగలనకా రాత్రనకా కట్టుకున్న గూడును మింగేయడం కోసం
అగ్రిమెంట్ పేపర్లపై పాత తేదీలతో సంతకాలు చేయించడం
అంబేద్కర్ రాయించిన రాజ్యాంగం ప్రకారం
కోర్టులో దావాలు వేయడం
కుటుంబాలను కూల్చడం
కొన్ని దలుల్భాజీ వెదవలకు సోంపు పొట్లం బుగ్గినంత సులభమే...!!?
అయినా
నీ అంతనికి నీకు నువ్వుగా రాసుకున్న వీలునామా అయితీరుతది అది
జైల్లో చిప్పకూడు కోసం లైన్లో నిల్చుండే వాడిగా మారడానికి చేసుకున్న ఏర్పాటు అదితది అది...!
రాజ్యాంగం అది కూడా రాసి ఉంచింది.
-విలాసాగరం రవీందర్
94409 32934.
తేది: 12.09.2017.
======= =====
మొగ్గను చిదిమెయ్యడం
పువ్వును నలిపెయ్యడం
ఆసరా నిలిచిన కొమ్మను కొరికెయ్యడం
నీడనిచ్చిన చెట్టును పెకిలించడం
మదపు ముఖాలకు, వెకిలి మూర్ఖులకు సాధారణమే...!
ఆపదలో ఆదుకున్న చేయిని కరెన్సీ నోట్లుగా లెక్కించడం
ఆత్మీయతను పంచిన మనుషులను నోట్ల కట్టలుగా భావించడం
తలను బాదడం
నేలకేసి కొట్టడం
రక్తపు మరకలు తేవడం
ఇంటెన్సీవ్ కేర్ లోకి తోసేయడం
కొన్ని ద్రోహపు చేతులకు సర్వ సాధారణమే...!!
అయినా
ఆగకుండా గబగబా నోట్లో గంజాయి సిగరేట్లను వెలిగించడం
కట్టుకున్న ఆలిచేత అష్ట కష్టాలు పెట్టించడం
పసి హృదయులను అల్లకల్లోలం చేయించడం
అయ్యా అవ్వలను నానా బూతులు తిట్టేలా చేయడం
కొన్ని నీచపు ముఖాలకు బర్కిల్ సిగరేట్ పీల్చినంత తేలికనే...!!!
పగలనకా రాత్రనకా కట్టుకున్న గూడును మింగేయడం కోసం
అగ్రిమెంట్ పేపర్లపై పాత తేదీలతో సంతకాలు చేయించడం
అంబేద్కర్ రాయించిన రాజ్యాంగం ప్రకారం
కోర్టులో దావాలు వేయడం
కుటుంబాలను కూల్చడం
కొన్ని దలుల్భాజీ వెదవలకు సోంపు పొట్లం బుగ్గినంత సులభమే...!!?
అయినా
నీ అంతనికి నీకు నువ్వుగా రాసుకున్న వీలునామా అయితీరుతది అది
జైల్లో చిప్పకూడు కోసం లైన్లో నిల్చుండే వాడిగా మారడానికి చేసుకున్న ఏర్పాటు అదితది అది...!
రాజ్యాంగం అది కూడా రాసి ఉంచింది.
-విలాసాగరం రవీందర్
94409 32934.
తేది: 12.09.2017.
Saturday, 12 August 2017
హాబీల సంగతి... హాబిట్స్ కతలు
హాబీల సంగతి, హాబిట్స్ కతలు
~~~~~~~~~~~~~~~~~~
జీవితం ఓ చిన్న పయణం
పుటుక ఉదయం
చావు అస్తమయం
వీటి మధ్య
అంతులేని అల్లరి మాయా స్నేహితులు...
అలవాట్లు...
పుట్టగానే పండుగ
ఇరుగు పొరుగు సంబురం
బంధువుల సంతోషపు కానుకలు
బావా మరదలు సరదాలు అబ్బో...
అదో టైటానిక్ సినిమా!
అమ్మ, నాన్న ఆనందానికి ఆకాశమే హద్దు
ఎగిరే పక్షుల కేరింతలు చెప్పనలవి కాదు !
మధ్యలో వచ్చి మధ్యలో పోయేటోనికి
పొగరెక్కువ,
బలుపు సంగతి నేనేం చెప్పను ?
పొంగే అలవాటు
గాలి బుడుగలు చెప్పతరమా !?
మన చుట్టూ ఉన్న సమాజం నుంచి
మన అలవాట్లు పురుడుపోసుకుంటయి...
షష్టి పూర్తీ చేసుకుంటయి.
మనకు తెలియకుండనే
మన శరీరాన్ని, మనసును
అస్తపంజరం చేస్తయి కొన్ని.
మనల్ని దేవుళ్ళను చేసి
దేవతల చేత పూజింపజేసి
లోకంలో కీర్తి కంకణాలు తొడుగుతయి మరికొన్ని!
మున్న పోయినేడు అలాటిదే
నన్ను నిస్తేజంగా పడుకోబెట్టి
ఇంటెన్సీవ్ కేర్ లో గతాన్నంత కొరికేసి
పార్సిల్ చేసినవి అలాటివే !
నిన్న
పోయిన యాదులను ఎప్పటిమాదిరిగా
ఎరగనట్టే తెచ్చి కూర్చోబెట్టి
నన్ను మరింత
శక్తిమంతున్ని చేసినవి మరిన్ని.
ఈ అక్షరాలు అలా చేరినవే !
మొన్నటి రోజున నా అనుమాల మిత్రుడి
వంశ వృక్షాన్ని
నిలువెల్ల పాతరేసి కుదేసినవి
శోకమెరుగని అశోకుడిని
శోక సముద్రంలో ముంచినవి అవే కదా?
ఆ ముసలి తల్లిని కన్నీళ్ళమయం చేసి,
కట్టుకున్న తాళిబొట్టును అపహాస్యం చేసి,
సంతోషంలో మునకలెయ్యాల్సిన చిట్టి చిట్టి చేతులకు
దుక్కపు ఆట నేర్పినవి
ఆ తుంటరి అల్లరి హాబిట్సే కదా !
హాబీలు మనల్ని ఆడించకూడదు
మనమే వాటిని బానిసలను చేయాలి
మనమే నియంత స్థానంలో ఉండి
వాటిని ఎగిరించాలి
వీలయితే ఆటాడించాలి
పసిపాపలా బుజ్జగించాలి
అవసరం అయితే
అంతం చేసి ఘోరి గట్టేయాలి...
అప్పుడే
ఈ జీవితానికి పూర్ణ యశస్సు...!
-విలాసాగరం రవీందర్.
Sunday, 25 June 2017
దుర్ముఖీ చెకుముఖీ
దుర్ముఖీ - చెకుముకీ!
************************
మా మనసులల్లోని అలవిమాలిన
అరిషడ్వర్గాలను
సంహరించే బుద్ధి కరవాలం
కావాలె నువ్వు
మా దుర్ముఖాల్లోని
మాయా మచ్చలను
మాయం చేసే లేపనంలా
భాసించాలె నువ్వు
చాపకింది నీరులా ప్రవహిస్తున్న
మూఢత్వపు పిడివాదుల
మాటల దుమ్మును దులిపే
మూల వాసుల సమర బాకువై కదలాలె
బహుజనుల
బతుకు వెలిగించే
దారి చూపించే
దీవి స్తంభం కావాలె నువ్వు
- విలాసాగరం రవీందర్, కరీంనగర్
- (Andhrajyothi.Apr.10, 2016)
************************
మా మనసులల్లోని అలవిమాలిన
అరిషడ్వర్గాలను
సంహరించే బుద్ధి కరవాలం
కావాలె నువ్వు
మా దుర్ముఖాల్లోని
మాయా మచ్చలను
మాయం చేసే లేపనంలా
భాసించాలె నువ్వు
చాపకింది నీరులా ప్రవహిస్తున్న
మూఢత్వపు పిడివాదుల
మాటల దుమ్మును దులిపే
మూల వాసుల సమర బాకువై కదలాలె
బహుజనుల
బతుకు వెలిగించే
దారి చూపించే
దీవి స్తంభం కావాలె నువ్వు
- విలాసాగరం రవీందర్, కరీంనగర్
- (Andhrajyothi.Apr.10, 2016)
Thursday, 22 June 2017
కరెన్సీ మనుషులే
విలాసాగరం | కరెన్సీ మనుషులే...
తలుపులు మూసాక అంతా చీకటేగా
వెలుగు రేఖలు లేవని మధనపడితే లాభమేమిటి ?
మాటల మంటలు మనసు మందిరాన్ని కాల్చాక
మిగిలేది ఒంటరితనమే కదా ?
తోడెవరూ లేరని వెక్కి వెక్కి ఏడిస్తే ఫలమేమి ?
చినుకు చినుకు జడివానై
నిండిన చెరువు కట్ట, తెగి
నీళ్ళన్నీ వాగు పాలయ్యాక
కన్నీళ్ళను నింపుకుంటే ఉపయోగముంటుందా ?
ఓటు మహారాణులను గంప గుత్తాగా
గంగిరెద్దులకు కట్టబెట్టి
అన్యాయంగా
ఇప్పుడు మా ఉసురు తీస్తున్నరని
బాధపడితే ప్రయోజనమేమిటి ?
యేరు దాటాక తెప్ప తగలెయ్యడం
మన వారికి వెన్నతో పెట్టిన విద్యనే కదా
తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టుడు
పుట్టుకతో వచ్చిన బుద్ధే కదా !
ఓట్లను నోట్ల కట్టలతో కొంటరు
తర్వాత
మనుషుల్ని కరెన్సీ నోట్లు గా లెక్కిస్తరు !!
తేది : 22.06.2015.
తలుపులు మూసాక అంతా చీకటేగా
వెలుగు రేఖలు లేవని మధనపడితే లాభమేమిటి ?
మాటల మంటలు మనసు మందిరాన్ని కాల్చాక
మిగిలేది ఒంటరితనమే కదా ?
తోడెవరూ లేరని వెక్కి వెక్కి ఏడిస్తే ఫలమేమి ?
చినుకు చినుకు జడివానై
నిండిన చెరువు కట్ట, తెగి
నీళ్ళన్నీ వాగు పాలయ్యాక
కన్నీళ్ళను నింపుకుంటే ఉపయోగముంటుందా ?
ఓటు మహారాణులను గంప గుత్తాగా
గంగిరెద్దులకు కట్టబెట్టి
అన్యాయంగా
ఇప్పుడు మా ఉసురు తీస్తున్నరని
బాధపడితే ప్రయోజనమేమిటి ?
యేరు దాటాక తెప్ప తగలెయ్యడం
మన వారికి వెన్నతో పెట్టిన విద్యనే కదా
తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టుడు
పుట్టుకతో వచ్చిన బుద్ధే కదా !
ఓట్లను నోట్ల కట్టలతో కొంటరు
తర్వాత
మనుషుల్ని కరెన్సీ నోట్లు గా లెక్కిస్తరు !!
తేది : 22.06.2015.
Friday, 9 June 2017
అనుకోని అతిథి
అనుకోని అతిథి...
మనసులో ఎంతో హత్తకోవాలని ఉంటుంది
బయట పడితే చులకనవుతామనీ
ఆలోచిస్తాం
కంట్లో కన్నీళ్ళ చలిమలుంటాయి
ఎదిటివారి దృష్టిలో పడకుండా
కాలువలను జలమయం చేసేస్తాం...
ఏనాటి అనుంధమో ఎదురుగా
తచ్చాడుతది...
నువ్వంటేనే నాకిష్టమని
చెప్పలేక చేతులతో టాటా విసిరేస్తం...
ఎవరు ఎందుకస్తరో తెలియదు
ఏ సంఘటన ఎందుకు జరుగుతదో తెలియదు
కానీ
జ్ఞాపకాలు
జీవితాంతం వేటాడుతయి
వెంట తరుముతయి...
అందుకే నా జీవితం కొనసాగుతుంది
ఎక్కడో జవాబు దొరుకుతది...
మనకు నచ్చిన అతిథి వస్తే
ఇక కదలకుండా బంధించడమే
చివరి చరణం...
-విలాసాగరం రవీందర్
94409 32934.
ఈ కవితను ప్రచురించిన నవ తెలంగాణ దర్వాజ పేజీ, నేటి నిజం పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.
Tuesday, 2 May 2017
ఆధునిక కళ
ఇంటి వెనుక చెట్టు పై నుంచి
పొద్దున్నే కోకిల కూత
బాల్య స్నేహితుడి పిలుపులా ఉంది.
వెనకే మరికొన్ని పక్షుల స్వరాలు
చిన్న నాటి సంగడీల దండులా తోచింది.
అలా అలా కాసేపు
జ్ఞాపకాల వాగులో
మిత్రులందరితో మునకేస్తున్నాను.
ట్రాక్టర్ ల రొదతో వాస్తవంలోకి వచ్చాను.
దూరంగా ఎగురుతూ పిట్టలు
వృక్షంపైన ఇంద్ర ధనస్సు మాయం
నా కలలాగే...
ఆధునీకరణ
ఇంకెన్ని పచ్చని కలలను
ధ్వంసిస్తుందో...
తేది : 02.05.2016.
పొద్దున్నే కోకిల కూత
బాల్య స్నేహితుడి పిలుపులా ఉంది.
వెనకే మరికొన్ని పక్షుల స్వరాలు
చిన్న నాటి సంగడీల దండులా తోచింది.
అలా అలా కాసేపు
జ్ఞాపకాల వాగులో
మిత్రులందరితో మునకేస్తున్నాను.
ట్రాక్టర్ ల రొదతో వాస్తవంలోకి వచ్చాను.
దూరంగా ఎగురుతూ పిట్టలు
వృక్షంపైన ఇంద్ర ధనస్సు మాయం
నా కలలాగే...
ఆధునీకరణ
ఇంకెన్ని పచ్చని కలలను
ధ్వంసిస్తుందో...
తేది : 02.05.2016.
Saturday, 29 April 2017
విధ్వంసం
'ఈ రాజ్యంలో పేదరికాన్ని అంతం చేస్తున్నం.
అందరికీ మిద్దెలు కట్టిస్తున్నం.
గ్రామాల్లో తారు రోడ్లను నిర్మిస్తున్నం.
పట్టణాల్లో పరిశ్రమల్ని పారిస్తున్నం.
రాజ్యాన్ని అన్ని రాజ్యాల కంటే ముందుకు నడిపిస్తున్నం'
ఓ రాజ్యాంగాధి నేత ప్రసంగం
బుల్లి తెరపై.
ఓ పచ్చని ఆకు కళ్ళలోకి చూస్తూ
అడిగా
'ఇదంతా నిజమేనా ?' అని.
'అవునవును అభివృద్ధి ఎంత నిజమో
విధ్వాంసమూ అంత వాస్తవం !'
ఆ ఆకు రాలుతూ
చెప్పిన చివరి వాక్యం.
తేది : 29.4.2016.
అందరికీ మిద్దెలు కట్టిస్తున్నం.
గ్రామాల్లో తారు రోడ్లను నిర్మిస్తున్నం.
పట్టణాల్లో పరిశ్రమల్ని పారిస్తున్నం.
రాజ్యాన్ని అన్ని రాజ్యాల కంటే ముందుకు నడిపిస్తున్నం'
ఓ రాజ్యాంగాధి నేత ప్రసంగం
బుల్లి తెరపై.
ఓ పచ్చని ఆకు కళ్ళలోకి చూస్తూ
అడిగా
'ఇదంతా నిజమేనా ?' అని.
'అవునవును అభివృద్ధి ఎంత నిజమో
విధ్వాంసమూ అంత వాస్తవం !'
ఆ ఆకు రాలుతూ
చెప్పిన చివరి వాక్యం.
తేది : 29.4.2016.
Friday, 28 April 2017
తప్పెవరిది?
తప్పెవరిది?
ఆప్యాయత పంచాల్సిన అమ్మే
కసాయిదయింది
కన్న మమకారమే లేకుండా
విషాద వీణ ను మీటింది
కరుణేమి లేకుండా
తను కన్న బిడ్డల
ప్రాణాలను తానే మింగేసింది
కొండ చిలువలా
కండ్లల్లో పెట్టుకొని రక్షించాల్సిన
తల్లే తన తనయుల పాడెను
సిద్ధం చేసింది
కాటికాపరిలా
ఆకలి అని అడగక ముందే
ఏ కాలం అనక పండ్లు పంచే మాత
వినాశన వ్రతంతో
కన్నీటి దారల్తో దప్పిక తీర్చుకుంది
రాక్షసావతారం దాల్చి
ఏడిస్తే జోలపాటలతో నిద్రపుచ్చాల్సిన జనని
ప్రతినాయక పాత్ర దాల్చి
ధ్వంస రచన చేసి
శిధిల మనసును మిగిల్చింది
...
చల్లని కొండ విరిగి
వేడి నెత్తురు ప్రవహించింది...
పిల్ల గాలి తునకలు పెను ఉప్పెనై
ఎత్తైన శిఖరాలను
మట్టి బెడ్డలుగా మార్చాయి...
...
మనిషీ...!
ప్రకృతి ధర్మాన్ని
తునాతునకలు చేసి
ఆకాశంలో పక్షిలా వేలాడుతూ
రొమ్ము విరుస్తూ
తూ లనాడింది నీవు కాదా...?
ధరణి కడుపును గుల్లగా మార్చి
రంద్రాల గొట్టాల్లోంచి పారే
రక్తపుటేరుల్ని
జలధారలనో సహజవాయువులలో
భ్రమించి జుర్రేసింది నీవు కాదా..?
నాజూకుగా మల్లెతీగలా
పాకుతూ నాట్యమాడే
నీటి పావురాలను
కాంక్రీటు పంజరాలతో బంధించి
కబలపు ముద్దలను అడ్డుపట్టి
వేడుకలో మునిగింది నీవు కాదా..?
అందంగా అలరారే గుట్ట కలువలను
నుజ్జు నుజ్జు చేసి
యంత్రాలతో కసితీరా కోసి కోసి
చంపేసి
నీ నట్టింట్లో ఆ కొండ శరీరాలను
ముగ్గులుగా మార్చుకొని
మురిసిపోయింది
నీవే కదరా..?
మరెందుకో దుఖఃస్తున్నవ్
నిరపరాధిలా
ఎవరుతీసిన గోతిలో
వారే పడతారని తెల్వదా...
నీకో నీతి
ఎదుటి వారికింకొకటా...?
తేది : 27.04.2015.
ఆప్యాయత పంచాల్సిన అమ్మే
కసాయిదయింది
కన్న మమకారమే లేకుండా
విషాద వీణ ను మీటింది
కరుణేమి లేకుండా
తను కన్న బిడ్డల
ప్రాణాలను తానే మింగేసింది
కొండ చిలువలా
కండ్లల్లో పెట్టుకొని రక్షించాల్సిన
తల్లే తన తనయుల పాడెను
సిద్ధం చేసింది
కాటికాపరిలా
ఆకలి అని అడగక ముందే
ఏ కాలం అనక పండ్లు పంచే మాత
వినాశన వ్రతంతో
కన్నీటి దారల్తో దప్పిక తీర్చుకుంది
రాక్షసావతారం దాల్చి
ఏడిస్తే జోలపాటలతో నిద్రపుచ్చాల్సిన జనని
ప్రతినాయక పాత్ర దాల్చి
ధ్వంస రచన చేసి
శిధిల మనసును మిగిల్చింది
...
చల్లని కొండ విరిగి
వేడి నెత్తురు ప్రవహించింది...
పిల్ల గాలి తునకలు పెను ఉప్పెనై
ఎత్తైన శిఖరాలను
మట్టి బెడ్డలుగా మార్చాయి...
...
మనిషీ...!
ప్రకృతి ధర్మాన్ని
తునాతునకలు చేసి
ఆకాశంలో పక్షిలా వేలాడుతూ
రొమ్ము విరుస్తూ
తూ లనాడింది నీవు కాదా...?
ధరణి కడుపును గుల్లగా మార్చి
రంద్రాల గొట్టాల్లోంచి పారే
రక్తపుటేరుల్ని
జలధారలనో సహజవాయువులలో
భ్రమించి జుర్రేసింది నీవు కాదా..?
నాజూకుగా మల్లెతీగలా
పాకుతూ నాట్యమాడే
నీటి పావురాలను
కాంక్రీటు పంజరాలతో బంధించి
కబలపు ముద్దలను అడ్డుపట్టి
వేడుకలో మునిగింది నీవు కాదా..?
అందంగా అలరారే గుట్ట కలువలను
నుజ్జు నుజ్జు చేసి
యంత్రాలతో కసితీరా కోసి కోసి
చంపేసి
నీ నట్టింట్లో ఆ కొండ శరీరాలను
ముగ్గులుగా మార్చుకొని
మురిసిపోయింది
నీవే కదరా..?
మరెందుకో దుఖఃస్తున్నవ్
నిరపరాధిలా
ఎవరుతీసిన గోతిలో
వారే పడతారని తెల్వదా...
నీకో నీతి
ఎదుటి వారికింకొకటా...?
తేది : 27.04.2015.
Thursday, 20 April 2017
అవీ... ఇవీ...
అవీ ... ఇవీ ...
మబ్బు తునకలు
తెల్లమొహంతో
మూర్ఛపోతున్నయి.
గుక్కెడు నీళ్లు జల్లండి.
☆☆☆
గాడ్పు కన్యలు
సూర్యారావు వాడి బాణాలకు
చెలించిన మనసుతో
వేడి నిశ్వాసలను విడుస్తున్నయి.
☆☆☆
పగటిపూటకు
నూట ఐదు డిగ్రీల జ్వరం
కాస్త అందరూ ఓ చెయ్యి వేయండి.
పచ్చ సముద్రంలో
ముంచి, మందు వేద్దాం.
☆☆☆
రాత్రి నక్షత్ర మండలంపై
నాకో కలొచ్చింది.
మనిషి చెట్టయినట్టు.
నీటి చెలిమయినట్టు.
☆☆☆
ప్రశ్నించడం
జ్ఞానాన్ని విస్తృతపరుచుకోవడం
మా పాప దిన చర్య.
నా అజ్ఞానాన్ని
కప్పిపుచ్చేందుకు
ప్రశ్నలను
ఏమార్చడం, మరిపించడం,
ప్రక్కదోవ పట్టించడం
నా రోజూ వారీ కార్యక్రమం.
- విలాసాగరం.
తేది : 21.04.2016.
మబ్బు తునకలు
తెల్లమొహంతో
మూర్ఛపోతున్నయి.
గుక్కెడు నీళ్లు జల్లండి.
☆☆☆
గాడ్పు కన్యలు
సూర్యారావు వాడి బాణాలకు
చెలించిన మనసుతో
వేడి నిశ్వాసలను విడుస్తున్నయి.
☆☆☆
పగటిపూటకు
నూట ఐదు డిగ్రీల జ్వరం
కాస్త అందరూ ఓ చెయ్యి వేయండి.
పచ్చ సముద్రంలో
ముంచి, మందు వేద్దాం.
☆☆☆
రాత్రి నక్షత్ర మండలంపై
నాకో కలొచ్చింది.
మనిషి చెట్టయినట్టు.
నీటి చెలిమయినట్టు.
☆☆☆
ప్రశ్నించడం
జ్ఞానాన్ని విస్తృతపరుచుకోవడం
మా పాప దిన చర్య.
నా అజ్ఞానాన్ని
కప్పిపుచ్చేందుకు
ప్రశ్నలను
ఏమార్చడం, మరిపించడం,
ప్రక్కదోవ పట్టించడం
నా రోజూ వారీ కార్యక్రమం.
- విలాసాగరం.
తేది : 21.04.2016.
Tuesday, 18 April 2017
పద్యం పొడవయ్యింది... అక్షర యాత్రలో...
విలాసాగరం | పద్యం పొడవయింది
ఒక్కోసారి
ఇంత అల్పమయిన దానికి
అంత ప్రాధాన్యత ఏంటని విసుక్కుంటం.
పాదాల వద్ద పడుండే వాటిని
తలకెక్కించుకోవడ మెందుకని
గోల గోల చేస్తం.
☆☆☆
తల వెంట్రుకలు
పిచ్చోడి వేషం వేసినప్పుడు
దువ్వెన డాక్టర్ గొప్పదనం గుర్తొస్తుంది.
తొవ్వెంబడి వెలుగు నిప్పులో
నీ పాదాలు బొబ్బలెక్కినప్పుడు
పాత చెప్పుల చల్లదనం,
నీడ చెట్టు ఆహ్లాదం
నీ మనసు పెట్టెకు తెలిసొస్తుంది.
........
ఇలాంటి ఆరో వేళ్ళు
కనిపించేవి వందలు
మూల మూలల్లో దాక్కునేవి వేలు...
☆☆☆
అబ్బ ఇంత చిన్న విషయానికి
ఇంత పోడవు పోయెం కూడా
అవసరం లేదు కావచ్చు
నిడివి తగ్గడానికి
కొంచెం సాయపడండి..
ఏ పాదాన్ని కోసేద్దాం ?
తేది : 17.4.2016.
ఒక్కోసారి
ఇంత అల్పమయిన దానికి
అంత ప్రాధాన్యత ఏంటని విసుక్కుంటం.
పాదాల వద్ద పడుండే వాటిని
తలకెక్కించుకోవడ మెందుకని
గోల గోల చేస్తం.
☆☆☆
తల వెంట్రుకలు
పిచ్చోడి వేషం వేసినప్పుడు
దువ్వెన డాక్టర్ గొప్పదనం గుర్తొస్తుంది.
తొవ్వెంబడి వెలుగు నిప్పులో
నీ పాదాలు బొబ్బలెక్కినప్పుడు
పాత చెప్పుల చల్లదనం,
నీడ చెట్టు ఆహ్లాదం
నీ మనసు పెట్టెకు తెలిసొస్తుంది.
........
ఇలాంటి ఆరో వేళ్ళు
కనిపించేవి వందలు
మూల మూలల్లో దాక్కునేవి వేలు...
☆☆☆
అబ్బ ఇంత చిన్న విషయానికి
ఇంత పోడవు పోయెం కూడా
అవసరం లేదు కావచ్చు
నిడివి తగ్గడానికి
కొంచెం సాయపడండి..
ఏ పాదాన్ని కోసేద్దాం ?
తేది : 17.4.2016.
Tuesday, 11 April 2017
చిక్కు ముడి
చిక్కు ముడి...
కలిసుండి విడిపోయామిప్పుడు
విడిపోయి కలుసున్న క్షణమిది
అదే విచిత్రం, విషాదం...
కన్నీటి వర్షం చినుకుల వానకు సంకేతమేమో
హృదయంలో ఇన్ని సంఘర్షణలు ఎక్కడివి?
జ్ఞాపకాల సముద్రంలో ఈ అల్లరి కెరటాలను
ఎలా విరమించను ?
ఆ వేడి నిట్టూర్పులు దేనికి సంకేతం?
ఆ వాడి బాణాల గమనమెటు ?
సమయమైతే తక్కువే ఉంది?
పాతికేళ్ల వెనక్కి ఎలా వెళ్ళను?
దారి నిండా నిప్పుల నెగళ్లు
బాట మూసి ముసిముసినవ్వులు రువ్వుతంది!
మరో తొవ్వల ఎలా నడవను?
అన్నీ ప్రశ్నలే
జవాబులు దొరకని జీవిత పోరాటం.
విలువలను వదలలేను
మోసాన్ని ఓర్వలేను
చిక్కు రహదారి
ఒంటరిగా నడుస్తూనే ఉన్న...
అగో
ఆ తీరంలో ఏదో రాసుంది
తొందరగా చదవాలి.
అల్లరి చేయకండి...
తేది: 12.04.2017.
కలిసుండి విడిపోయామిప్పుడు
విడిపోయి కలుసున్న క్షణమిది
అదే విచిత్రం, విషాదం...
కన్నీటి వర్షం చినుకుల వానకు సంకేతమేమో
హృదయంలో ఇన్ని సంఘర్షణలు ఎక్కడివి?
జ్ఞాపకాల సముద్రంలో ఈ అల్లరి కెరటాలను
ఎలా విరమించను ?
ఆ వేడి నిట్టూర్పులు దేనికి సంకేతం?
ఆ వాడి బాణాల గమనమెటు ?
సమయమైతే తక్కువే ఉంది?
పాతికేళ్ల వెనక్కి ఎలా వెళ్ళను?
దారి నిండా నిప్పుల నెగళ్లు
బాట మూసి ముసిముసినవ్వులు రువ్వుతంది!
మరో తొవ్వల ఎలా నడవను?
అన్నీ ప్రశ్నలే
జవాబులు దొరకని జీవిత పోరాటం.
విలువలను వదలలేను
మోసాన్ని ఓర్వలేను
చిక్కు రహదారి
ఒంటరిగా నడుస్తూనే ఉన్న...
అగో
ఆ తీరంలో ఏదో రాసుంది
తొందరగా చదవాలి.
అల్లరి చేయకండి...
తేది: 12.04.2017.
Tuesday, 4 April 2017
మాయలోళ్ళు
విలాసాగరం | మాయలోళ్ళు
డబ్బు డబ్బునే ప్రేమిస్తుంది
పైసలు పైసలనే పెండ్లాడుతయి
విలాసాలు విలాసాలకే రెడ్ కార్పెట్ పరుస్తయి
ధాన ధర్మాలన్నీ
పనిచేయని వారి పేరు మీదే ఊరేగుతయి
పండించినోని పేరు
పేరుకైనా ప్రస్తావనకు రాదు
చమటోడ్చిన చేతుల సౌందర్యం
అణుమాత్రం తలపుకు తట్టదు
రేసు గుర్రాలకు
వందల కోట్ల అప్పులు
అప్పనంగా సమకూరుతయి
క్రికెట్ వ్యాపారులకు
వేల కోట్ల ఋణాలు
అడగకుండనే చెక్కులయి ఎదురస్తయి
పుట్టిన రోజు పండుగలకు
వందల మంది హాజరయితరు
తలకో కోటి చొప్పున
వందల కోట్లు ఖర్చయితయి
చీర్ గర్ల్స్ ఛాయలెంట పరుగులిడి
బికినీల నీడలో
కరెన్సీ కట్టలను వెద జల్లుతూ
వృద్ధ కపోతాలు టీనేజ్ యువకుల్లా
జల్సాలు చేస్తాయి
ఇంకోవైపు
జీతాలు రాక కొన్ని జీవితాలు ఆగమైతయి
విమానాలు నడుపుతున్నా
కూటికి కష్టమయితది
వీరికి ఏ దేశమూ వీజా మంజూరు చేయదు
విధిలేక
ఉరితాళ్ళు ఫ్యాన్లకు వేలాడుతయి
చూస్తుండగానే
వేల కోట్లు పలారం లెక్క మాయమైతయి
గడ్డపారలను చెదలు తిన్నట్టు
ప్రజల పైసలు గాలిలో కల్సిపోతయి
పెద్దాయన దర్జాగా విమానమెక్కి
మరో విహార క్షేత్రానికి
పలాయన మయినంక
నోట్ల కట్టలు కళ్ళు తెరిచి
తప్పుపోయినట్లు అమాయకంగా
దొంగేడుపు ఏడుస్తుంటయి
ప్రజలు అమాయకంగా
అయ్యో పాపం అనుకుంటరు !
ఆ వెనకే మాయలోళ్ళ
మాయం కోసం ఇసిరెలు సరి చేస్తుంటరు !!
తేది : 18.3.2016.
డబ్బు డబ్బునే ప్రేమిస్తుంది
పైసలు పైసలనే పెండ్లాడుతయి
విలాసాలు విలాసాలకే రెడ్ కార్పెట్ పరుస్తయి
ధాన ధర్మాలన్నీ
పనిచేయని వారి పేరు మీదే ఊరేగుతయి
పండించినోని పేరు
పేరుకైనా ప్రస్తావనకు రాదు
చమటోడ్చిన చేతుల సౌందర్యం
అణుమాత్రం తలపుకు తట్టదు
రేసు గుర్రాలకు
వందల కోట్ల అప్పులు
అప్పనంగా సమకూరుతయి
క్రికెట్ వ్యాపారులకు
వేల కోట్ల ఋణాలు
అడగకుండనే చెక్కులయి ఎదురస్తయి
పుట్టిన రోజు పండుగలకు
వందల మంది హాజరయితరు
తలకో కోటి చొప్పున
వందల కోట్లు ఖర్చయితయి
చీర్ గర్ల్స్ ఛాయలెంట పరుగులిడి
బికినీల నీడలో
కరెన్సీ కట్టలను వెద జల్లుతూ
వృద్ధ కపోతాలు టీనేజ్ యువకుల్లా
జల్సాలు చేస్తాయి
ఇంకోవైపు
జీతాలు రాక కొన్ని జీవితాలు ఆగమైతయి
విమానాలు నడుపుతున్నా
కూటికి కష్టమయితది
వీరికి ఏ దేశమూ వీజా మంజూరు చేయదు
విధిలేక
ఉరితాళ్ళు ఫ్యాన్లకు వేలాడుతయి
చూస్తుండగానే
వేల కోట్లు పలారం లెక్క మాయమైతయి
గడ్డపారలను చెదలు తిన్నట్టు
ప్రజల పైసలు గాలిలో కల్సిపోతయి
పెద్దాయన దర్జాగా విమానమెక్కి
మరో విహార క్షేత్రానికి
పలాయన మయినంక
నోట్ల కట్టలు కళ్ళు తెరిచి
తప్పుపోయినట్లు అమాయకంగా
దొంగేడుపు ఏడుస్తుంటయి
ప్రజలు అమాయకంగా
అయ్యో పాపం అనుకుంటరు !
ఆ వెనకే మాయలోళ్ళ
మాయం కోసం ఇసిరెలు సరి చేస్తుంటరు !!
తేది : 18.3.2016.
తల రాతలు
విలాసాగరం | తల రాతలు
1.
అది ఒక వ్యర్థ భూమి
ఏరుకోవడం రానివారికి
అది ఒక పవిత్ర క్షేత్రం
పిండుకోవడం నేర్చిన వాడికి
2.
అక్కడ కొన్ని లేత తీగలు
వరుసలతో కట్టేసీవుంటాయి
సరస్సు లోంచి తీసి
ఆరేసిన చేప పిల్లల్లా
ఒక పెద్ద తల అటూ ఇటూ తిరుగుతూ
కాపలాకాస్తూ వుంటుంది
సరిహద్దు సైనికుడిలా
మధ్య మధ్యలో అపరిచిత సీతాకోక చిలుకలు
భయం కలిగిస్తూ తడుముతూ వెలుతుంటాయి
దొంగలను వెతికే రక్షక భటుల్లా
3.
సంవత్సరం మొత్తం పోగేసిన బంగారాన్ని
అందమైన ఆకృతి లోకి
మూడు గంటల్లో పోత పోయాలి
స్వర్ణ కారుడిలా
ఇష్టం వున్నా లేకపోయినా
శరీరంలోని కణకణాన్ని కోసి
ఆ రూపానికి ప్రాణం పొయ్యాలి
ఆధునిక బ్రహ్మలా
జీవి కొట్లాడుతున్నా
మనసు గదిలోని మాటల మణులను చేర్చి
ఆ అవతారానికి సౌష్ఠవాన్ని చేకూర్చాలి
బ్యూటీషన్ లా
అంచనా అయ్యగారిని ఆకర్షించడం కోసమైనా...
4.
ఎంతటి ప్రాణమున్న పసిడి బొమ్మయినా
రత్నాల జిలుగులు నిండినా
దాని అసలు విలువ తెలిసేది
సరియైన ఆటగాడిని చేరితేనే
ఎంత అందం పోతబోసుకున్నా
రసికుడిని చేరినప్పడే కదా
దాని జీవితం సార్థకం అయ్యేది ?
5.
అక్కడ కొన్ని చెవులు
కొరుక్కుంటున్నాయి
కాబోయే ఈ దేశ పౌరుల
తల రాతలు ఇక్కడే రాసుకుంటున్నారని...
కొన్ని గుండెలు బాదుకుంటున్నాయి
కొందరు గుంజుకొని రాస్తున్నారని....!
తేది : 03.04.2015.
1.
అది ఒక వ్యర్థ భూమి
ఏరుకోవడం రానివారికి
అది ఒక పవిత్ర క్షేత్రం
పిండుకోవడం నేర్చిన వాడికి
2.
అక్కడ కొన్ని లేత తీగలు
వరుసలతో కట్టేసీవుంటాయి
సరస్సు లోంచి తీసి
ఆరేసిన చేప పిల్లల్లా
ఒక పెద్ద తల అటూ ఇటూ తిరుగుతూ
కాపలాకాస్తూ వుంటుంది
సరిహద్దు సైనికుడిలా
మధ్య మధ్యలో అపరిచిత సీతాకోక చిలుకలు
భయం కలిగిస్తూ తడుముతూ వెలుతుంటాయి
దొంగలను వెతికే రక్షక భటుల్లా
3.
సంవత్సరం మొత్తం పోగేసిన బంగారాన్ని
అందమైన ఆకృతి లోకి
మూడు గంటల్లో పోత పోయాలి
స్వర్ణ కారుడిలా
ఇష్టం వున్నా లేకపోయినా
శరీరంలోని కణకణాన్ని కోసి
ఆ రూపానికి ప్రాణం పొయ్యాలి
ఆధునిక బ్రహ్మలా
జీవి కొట్లాడుతున్నా
మనసు గదిలోని మాటల మణులను చేర్చి
ఆ అవతారానికి సౌష్ఠవాన్ని చేకూర్చాలి
బ్యూటీషన్ లా
అంచనా అయ్యగారిని ఆకర్షించడం కోసమైనా...
4.
ఎంతటి ప్రాణమున్న పసిడి బొమ్మయినా
రత్నాల జిలుగులు నిండినా
దాని అసలు విలువ తెలిసేది
సరియైన ఆటగాడిని చేరితేనే
ఎంత అందం పోతబోసుకున్నా
రసికుడిని చేరినప్పడే కదా
దాని జీవితం సార్థకం అయ్యేది ?
5.
అక్కడ కొన్ని చెవులు
కొరుక్కుంటున్నాయి
కాబోయే ఈ దేశ పౌరుల
తల రాతలు ఇక్కడే రాసుకుంటున్నారని...
కొన్ని గుండెలు బాదుకుంటున్నాయి
కొందరు గుంజుకొని రాస్తున్నారని....!
తేది : 03.04.2015.
చిరునామా ఖాళీ...
చిరునామా ఖాళీ
~~~~~~~~
పంట పండుతుంది
దలారుల పంటా పండుతుంది
అన్నం పెట్టిన చెయ్యికి
అప్పుల కుప్ప మిగులుతుంది
ఏ పార్టీ కూడా ఇతణ్ణి
కార్యకర్తను చేసుకోవటానికి ఇష్ట పడదు
కార్తె క్యాలెండర్ నెల మారుతుంది
పంట ఋణం
రి-షెడ్యూలు రంగు పూసుకుంటుంది
బ్యాంకు ట్రెజరీ లో
విత్తనాలకు పైసలు లేక
ఉరి కొయ్యలకు రెక్కలస్తయి
కుటుంబానికి కుటుంబం
గుండె బాయి నుంచి
దుక్కాన్ని తోడుకుంటరు
రాజ్యపు గద్దకు
ఓదార్పుకూ సమయముండదు
ఏదో ఒక పథకం పేర
ఎలక్షన్లకు ముందు ఓ చల్లని చెక్కు
కోరియర్ లో మెరుస్తూ వస్తుంది
ఆ చిరునామా లో
కొరియర్ బాయ్ డెలివర్
చేయడానికి ఎవరూ ఉండరు.
తేది : 17.03.2016.
~~~~~~~~
పంట పండుతుంది
దలారుల పంటా పండుతుంది
అన్నం పెట్టిన చెయ్యికి
అప్పుల కుప్ప మిగులుతుంది
ఏ పార్టీ కూడా ఇతణ్ణి
కార్యకర్తను చేసుకోవటానికి ఇష్ట పడదు
కార్తె క్యాలెండర్ నెల మారుతుంది
పంట ఋణం
రి-షెడ్యూలు రంగు పూసుకుంటుంది
బ్యాంకు ట్రెజరీ లో
విత్తనాలకు పైసలు లేక
ఉరి కొయ్యలకు రెక్కలస్తయి
కుటుంబానికి కుటుంబం
గుండె బాయి నుంచి
దుక్కాన్ని తోడుకుంటరు
రాజ్యపు గద్దకు
ఓదార్పుకూ సమయముండదు
ఏదో ఒక పథకం పేర
ఎలక్షన్లకు ముందు ఓ చల్లని చెక్కు
కోరియర్ లో మెరుస్తూ వస్తుంది
ఆ చిరునామా లో
కొరియర్ బాయ్ డెలివర్
చేయడానికి ఎవరూ ఉండరు.
తేది : 17.03.2016.
Tuesday, 14 March 2017
మనసున్న మనుషుల కోసం ఆరాటం...
మనసున్న మనుషుల కోసం ఆరాటం...
నాకు
కిలో నవ్వులు
రెండు కిలోల సంతోషం
మూడు కిలోల సంబురం
నాలుగు కిలోల ఆనందం
ఒక్క ముచ్చట చాయతో కావాలి !
నువ్వు నేను మాట్లాడి గుద్దు కున్నా సరే
నేను నువ్వు కలిసి ఓ కిలో మీటరయినా నడవాల.
గతంలో కొట్లాడుకున్నా సరే !!
నాతో గంట మాట్లాడాలి చెట్ల కింద
ఇంతకు ముందు ముభావంగా ఉన్నా సరే !
నేను నిన్ను గుర్తించకున్నా సరే
నువ్వు నన్ను గుర్తు పట్టి పలకరించి
చాయ తాగాలి సుమా, డబ్బులు నావే !
నువ్వు నేను కలిసి కిలో మీటర్లు తిరిగింది
నేను మరచి పోయిన
నన్ను మరో కిలో మీటరయిన ముచ్చటిస్తూ తిరగాలి !
నేను మరచిపోయాను
మనం స్నేహితులం అని
నీకు గుర్తుండే ఉంటుంది
మన అనుబంధాన్ని గుర్తు చేయాలి !
నీకు గుర్తుండే వుంటుంది
మనం
పరిచయస్తులమని
నేను యాది మరచిన
జ్ఞాపకాలు యాదికొచ్చేలా
ఓ ఆలింగమివ్వాలి !
అలాంటి
మనుషులు కావాలి నాకు !
నేను దేవుడిని నమ్మను
నా దృష్టిలో మనసున్న మనుషులే దేవుళ్ళు !
వెతుక్కుంటూ ఒంటరిగా నడుస్తూనే ఉన్న
ఎక్కడో ఎదురతా
జ్ఞాపకాలు శాశ్వతం
మరపు అసహజమే !!
-విలాసాగరం రవీందర్.
94409 32934.
నవ తెలంగాణ సాహితీ పేజీ 'దర్వాజ' లో 13-3-2017 సోమవారం ప్రచురించబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
నాకు
కిలో నవ్వులు
రెండు కిలోల సంతోషం
మూడు కిలోల సంబురం
నాలుగు కిలోల ఆనందం
ఒక్క ముచ్చట చాయతో కావాలి !
నువ్వు నేను మాట్లాడి గుద్దు కున్నా సరే
నేను నువ్వు కలిసి ఓ కిలో మీటరయినా నడవాల.
గతంలో కొట్లాడుకున్నా సరే !!
నాతో గంట మాట్లాడాలి చెట్ల కింద
ఇంతకు ముందు ముభావంగా ఉన్నా సరే !
నేను నిన్ను గుర్తించకున్నా సరే
నువ్వు నన్ను గుర్తు పట్టి పలకరించి
చాయ తాగాలి సుమా, డబ్బులు నావే !
నువ్వు నేను కలిసి కిలో మీటర్లు తిరిగింది
నేను మరచి పోయిన
నన్ను మరో కిలో మీటరయిన ముచ్చటిస్తూ తిరగాలి !
నేను మరచిపోయాను
మనం స్నేహితులం అని
నీకు గుర్తుండే ఉంటుంది
మన అనుబంధాన్ని గుర్తు చేయాలి !
నీకు గుర్తుండే వుంటుంది
మనం
పరిచయస్తులమని
నేను యాది మరచిన
జ్ఞాపకాలు యాదికొచ్చేలా
ఓ ఆలింగమివ్వాలి !
అలాంటి
మనుషులు కావాలి నాకు !
నేను దేవుడిని నమ్మను
నా దృష్టిలో మనసున్న మనుషులే దేవుళ్ళు !
వెతుక్కుంటూ ఒంటరిగా నడుస్తూనే ఉన్న
ఎక్కడో ఎదురతా
జ్ఞాపకాలు శాశ్వతం
మరపు అసహజమే !!
-విలాసాగరం రవీందర్.
94409 32934.
నవ తెలంగాణ సాహితీ పేజీ 'దర్వాజ' లో 13-3-2017 సోమవారం ప్రచురించబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
Subscribe to:
Posts (Atom)


























