Saturday, 24 September 2016

రెక్కలు తెగిన జ్ఞాపకం!

పాత పుస్తకాలు సదురుతుంటే
ఓ బొమ్మ జారి నా కంట బడింది.
నేను చిన్నగున్నప్పుడు వేసింది 
ఎలా ఉందని మా పిల్లలకు చూపాను.

ఎగిరి గంతులేసారు
బొమ్మనే అంత అందంగ ఉంటే
నిజంగ ఎంత అద్భుతంగా ఉంటుందో
వెంటనే చూడాలన్నారు.

అందరం ఉత్సాహంగా బయలుదేరాం
గంటలో నాకు బాగా 
గుర్తున్న చోటులో ఆగాం.

అక్కడ ఒక పెద్ద గుంత ఉంది
ఇంకొంచెం ముందుకు వెళ్ళాం
ఆ చోట కొన్ని మట్టి దిబ్బలు
ఏ ఆకారమో తెలియని మరిన్ని 
రాళ్లు పడున్నాయి.

బొమ్మలో గుట్ట ...
విషాదంగా కనబడింది !

No comments:

Post a Comment