ఉదయం నిదుర లేవగానే
పసివాడి కేరింతలా
ఆత్మీయతతో పక్షుల పలకరింపు
తలుపు తీయగానే పచ్చనాకుల నగలతో నవ్వుతూ చెట్లు.
మనసునిండా చల్లదనాన్ని నింపుతూ
ఎదురేగే వర్ష కాంతలు
తనువును మొలకాంకురం చేస్తూ
గిలిగింతలు పెట్టే గాడ్పు చెలియలు.
ఇవి చాలవా
జీవితన్ని వెలిగించడానికి
ఆహ్లాదభరితం చేయడానికి.
ఆధునికత మనల్ని
ఎంత గరుకుగా తయారు చేస్తంది.
పదండి
ప్రకృతిలో పిట్టలమవుదాం
ఆకృతిలో చెట్టులమవుదాం..

No comments:
Post a Comment