వెన్నెల రాత్రి
నక్షత్రాల వెలుగును
నెమరువేస్తున్నఇసుక తిన్నెలు.
మొగ్గలయినయి.
విచ్చుకుంటున్న ఇసుక పుష్పాలు.
ప్రశాంత నిద్రలో ప్రకృతి.
దూరంగా అలికిడి
పొగ బండ్లు దగ్గరకు జరిగిన వాసన
కొన్ని నీడలు కదులుతూ
గంటలో పని పూర్తి చేసినయి.
ఎండు గడ్డిలా వచ్చి నిండు కుండలా
వెలుతున్న వాహన కడుపులు.
చెట్టు పై నుంచి ఓ తీతువు పిట్ట అరుస్తంది
'ఒరేయ్ నీచుల్లారా !
జల దీపాలను ఆర్పిన పాపం
ఊరకే పోదురా. అంతకంతా అనుభవిస్తరు !'
నక్షత్రాల వెలుగును
నెమరువేస్తున్నఇసుక తిన్నెలు.
మొగ్గలయినయి.
విచ్చుకుంటున్న ఇసుక పుష్పాలు.
ప్రశాంత నిద్రలో ప్రకృతి.
దూరంగా అలికిడి
పొగ బండ్లు దగ్గరకు జరిగిన వాసన
కొన్ని నీడలు కదులుతూ
గంటలో పని పూర్తి చేసినయి.
ఎండు గడ్డిలా వచ్చి నిండు కుండలా
వెలుతున్న వాహన కడుపులు.
చెట్టు పై నుంచి ఓ తీతువు పిట్ట అరుస్తంది
'ఒరేయ్ నీచుల్లారా !
జల దీపాలను ఆర్పిన పాపం
ఊరకే పోదురా. అంతకంతా అనుభవిస్తరు !'
No comments:
Post a Comment