వాగొడ్డున
ఓ పచ్చని చెట్టు కొసన
అటూ ఇటూ ఊగుతున్న కొమ్మలు
'బుడ్డోడా ఎక్కువ ఊగకు అలిసి పోతవ్
అసలే నీటికి కటకట
ఇక కొద్ది రోజులే నీ ఆటలు
ఎన్ని మైళ్ళు వేళ్ళు చొచ్చుకెల్లినా
గుక్కెడు నీటి ఊట లేదట
నిన్న అమ్మ బాధ పడుతూ చెప్పింది.'
పెద్ద కొమ్మ చిన్న కొమ్మతో
'అయ్యో పెద్దోడా
నాకేమీ బాధ లేదు
కాని
ఈ మాట వింటే
నా కొసన ఇప్పుడిప్పుడే
వికసిస్తున్న
మొగ్గ హృదయమెంత రోదిస్తుందో కదా'
ఈ మాటలు విన్నాయేమో
వాగొడ్డున చీమల బారుల్లా వెల్తున్న
ఇసుక లారీల్లోని ఇసుక రేణువులు
గుండెలు పగిలి కన్నీటిని కారుస్తున్నాయి లారీల వెనక
బొట్లు బొట్లు గా...
ధారాపాతంగా...
ఓ పచ్చని చెట్టు కొసన
అటూ ఇటూ ఊగుతున్న కొమ్మలు
'బుడ్డోడా ఎక్కువ ఊగకు అలిసి పోతవ్
అసలే నీటికి కటకట
ఇక కొద్ది రోజులే నీ ఆటలు
ఎన్ని మైళ్ళు వేళ్ళు చొచ్చుకెల్లినా
గుక్కెడు నీటి ఊట లేదట
నిన్న అమ్మ బాధ పడుతూ చెప్పింది.'
పెద్ద కొమ్మ చిన్న కొమ్మతో
'అయ్యో పెద్దోడా
నాకేమీ బాధ లేదు
కాని
ఈ మాట వింటే
నా కొసన ఇప్పుడిప్పుడే
వికసిస్తున్న
మొగ్గ హృదయమెంత రోదిస్తుందో కదా'
ఈ మాటలు విన్నాయేమో
వాగొడ్డున చీమల బారుల్లా వెల్తున్న
ఇసుక లారీల్లోని ఇసుక రేణువులు
గుండెలు పగిలి కన్నీటిని కారుస్తున్నాయి లారీల వెనక
బొట్లు బొట్లు గా...
ధారాపాతంగా...
No comments:
Post a Comment