ఒక్కోసారి
ఇంత అల్పమయిన దానికి
అంత ప్రాధాన్యత ఏంటని విసుక్కుంటం.
పాదాల వద్ద పడుండే వాటిని
తలకెక్కించుకోవడ మెందుకని
గోల గోల చేస్తం.
☆☆☆
తల వెంట్రుకలు
పిచ్చోడి వేషం వేసినప్పుడు
దువ్వెన డాక్టర్ గొప్పదనం గుర్తొస్తుంది.
తొవ్వెంబడి వెలుగు నిప్పులో
నీ పాదాలు బొబ్బలెక్కినప్పుడు
పాత చెప్పుల చల్లదనం,
నీడ చెట్టు ఆహ్లాదం
నీ మనసు పెట్టెకు తెలిసొస్తుంది.
దారి తప్పి
తిరిగిన తొవ్వనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ
చిర్రెత్తుకొచ్చే వేళ
మాసిపోయిన
పరిచయమయిన పాత ముఖం తారసపడితే
ఎంత హాయో చెప్పనలవా ?
☆☆☆
ఇలాంటి ఆరో వేళ్ళు
జీవితం పొడవునా
కనిపించేవి కొన్నే
మూల మూలల్లో దాక్కునేవే అనంతం...
ఇంత అల్పమయిన దానికి
అంత ప్రాధాన్యత ఏంటని విసుక్కుంటం.
పాదాల వద్ద పడుండే వాటిని
తలకెక్కించుకోవడ మెందుకని
గోల గోల చేస్తం.
☆☆☆
తల వెంట్రుకలు
పిచ్చోడి వేషం వేసినప్పుడు
దువ్వెన డాక్టర్ గొప్పదనం గుర్తొస్తుంది.
తొవ్వెంబడి వెలుగు నిప్పులో
నీ పాదాలు బొబ్బలెక్కినప్పుడు
పాత చెప్పుల చల్లదనం,
నీడ చెట్టు ఆహ్లాదం
నీ మనసు పెట్టెకు తెలిసొస్తుంది.
దారి తప్పి
తిరిగిన తొవ్వనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ
చిర్రెత్తుకొచ్చే వేళ
మాసిపోయిన
పరిచయమయిన పాత ముఖం తారసపడితే
ఎంత హాయో చెప్పనలవా ?
☆☆☆
ఇలాంటి ఆరో వేళ్ళు
జీవితం పొడవునా
కనిపించేవి కొన్నే
మూల మూలల్లో దాక్కునేవే అనంతం...

No comments:
Post a Comment