Tuesday, 11 October 2016

నెత్తురవిసిన వేళ -

నెత్తురవిసిన వేళ -

తెల్లారితే చాలు నా ప్రమేయం లేకుండానే 
నా ఐపీ అడ్రస్ మారి పోతుంది 
జీ మెయిల్లో నా చరిత్ర మరోటి 
అయిందంటూ నోటీఫీకేషన్ వచ్చి
తింటున్న అన్నం ముద్దను సయించనీయదు.

ఈ రాత్రి గడిస్తే చాలు 
నా పాస్వర్డ్ మరోలా మారి 
నా వైపు  వెక్కిరింతగా  నవ్వుతూ 
నన్నే పరిహాసం చేస్తుంటుంది.

రాత్రికి రాత్రి నా చిరునామా 
తలలో ఎవరివో కాళ్ళు మొలిచి
నన్నే తన్నుతూ -

పోరాట సమయాన 
తోక ముడిచిన విదూషకుడు 
బృహన్నల వేషంలో -

నన్ను నేను వెతుక్కుంటూ 
చరిత్ర పుటల్ని తవ్వుతుంటే
కరెన్సీ కాగితాల శిధిలాల నడుమ
మానవ కపాలాలు నెత్తురవిసి -

కన్నతల్లి తల అడ్డంగా నరుకుతూ
తనవారే -

-
తేది:  10.10.2016.

No comments:

Post a Comment