Friday, 9 June 2017

అనుకోని అతిథి



అనుకోని అతిథి...

మనసులో ఎంతో హత్తకోవాలని ఉంటుంది
బయట పడితే చులకనవుతామనీ
ఆలోచిస్తాం

కంట్లో కన్నీళ్ళ చలిమలుంటాయి
ఎదిటివారి దృష్టిలో పడకుండా
కాలువలను జలమయం చేసేస్తాం...

ఏనాటి అనుంధమో ఎదురుగా
తచ్చాడుతది...
నువ్వంటేనే నాకిష్టమని
చెప్పలేక చేతులతో టాటా విసిరేస్తం...

ఎవరు ఎందుకస్తరో తెలియదు
ఏ సంఘటన ఎందుకు జరుగుతదో తెలియదు

కానీ
జ్ఞాపకాలు
జీవితాంతం వేటాడుతయి
వెంట తరుముతయి...

అందుకే నా జీవితం కొనసాగుతుంది
ఎక్కడో జవాబు దొరుకుతది...

మనకు నచ్చిన అతిథి వస్తే
ఇక కదలకుండా బంధించడమే
చివరి చరణం...

-విలాసాగరం రవీందర్
  94409 32934.

ఈ కవితను ప్రచురించిన నవ తెలంగాణ దర్వాజ పేజీ, నేటి నిజం పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.

2 comments:

  1. చాలా బాగుంది కవి గారు.

    ReplyDelete
  2. చెప్పకనే అన్నీ చెప్పేసారు.... చాలా చాలా బాగుంది రవీందర్ గారు....

    ReplyDelete